జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్ లో ఇద్దరు పోలీసుల మృతదేహాలు లభ్యమయ్యాయి. జిల్లాలో ఆదివారం ఉదయం ఇద్దరు పోలీసులు బుల్లెట్ గాయాలతో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పరస్పర విబేధాలే ఈ ఘటనకు కారణమని భావిస్తున్నారు. ఉదయం 6.30 గంటల ప్రాంతంలో జిల్లా కేంద్రంలోని కాళీమాత ఆలయం వెలుపల పోలీసు వ్యాన్‌లో బుల్లెట్‌లతో కూడిన మృతదేహాలు పడి ఉన్నాయని అధికారులు తెలిపారు.