అడిలైడ్ వేదికగా జరిగిన టెస్టులో సెంచరీ చేసిన హెడ్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాక సిరాజ్ సంబరాలు చేసుకున్నాడు. ఆ సమయంలో హెడ్ తనను దూషించాడని సిరాజ్ తెలిపాడు. అయితే హెడ్ మాత్రం తాను ‘వెల్ బౌల్డ్’ అన్నప్పటికీ సిరాజ్ తప్పుగా అర్థం చేసుకున్నాడంటూ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వెల్లడించాడు. అయితే 'అప్పుడు నేనేమీ మాట్లాడలేదు. కానీ, ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాత్రం హెడ్ చాలా అబద్ధాలు చెప్పాడు.' అని సిరాజ్ వెల్లడించాడు.