రాజస్థాన్‌లో బోల్తా పడ్డ బస్సు, ముగ్గురు విద్యార్థులు మృతి (వీడియో)

79చూసినవారు
రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రాజ్‌సమంద్ జిల్లా దేసూరి నాలాలో ఆదివారం ఉదయం పాఠశాల విద్యార్థులతో చార్భుజ నుంచి రణక్‌పూర్‌కు వెళుతున్న ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృతిచెందగా, 24 మందికి పైగా విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, గాయపడ్డ విద్యార్థులను సమీప ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్