ఏపీలో విద్యా వ్యవస్థపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో చదివానంటున్న మంత్రి నారా లోకేశ్ విధి విధానాలు ఏపీలోని విద్యార్థుల కలలను అణిచివేస్తున్నాయి. మాజీ సీఎం జగన్ ప్రవేశపెట్టిన నాడు-నేడు, ఇంగ్లీష్ మీడియం విద్య, సీబీఎస్ఈ అనుబంధం లాంటివి విద్యార్థులకు దూరం చేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల వైపు విద్యార్థులను నడిపిస్తున్నారు. ఏపీలో విద్యార్థుల భవిష్యత్ ఇంతేనా?.’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.