పంజాబ్‌లోని లూథియానాలో ఇటీవల జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భటిండా గ్రామానికి చెందిన సుఖ్‌వీర్ సింగ్..పెళ్లి సాకుతో ఓ యువతిపై(24) పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో యువతి సిమ్లాపురి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం విచారణ చేపట్టిన ఎస్సై రాజిందర్ కౌర్ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. జూలై 31న పోలీసులకు తన వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది.