చెరుకులో జీరో ఫ్యాట్, కొలెస్ట్రాల్, ఫైబర్, ప్రొటీన్లు ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మానికి మేలు చేస్తుంది. చెరుకు రసం తీసుకోవడం వల్ల ఒత్తిడి దూరం అవుతుంది. ఎముకలు దృఢంగా మారుతాయి. దీనిలో గ్లైకోలిక్ ఆల్ఫా మైడ్రాక్సీ వంటి ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇది కణాల ఉత్పత్తిని పెంచుతుంది. ముఖంపై ఉన్న మొటిమలను తొలగించడంలో తోడ్పడుతుంది. అన్ని రకాల చర్మ సమస్యలకు ఇది ఉత్తమంగా పనిచేస్తుంది.