రివర్స్ తీస్తుండగా వాగులో పడ్డ కారు.. ఒకరు మృతి (వీడియో)

57చూసినవారు
కారు రివర్స్ తీస్తుండగా అదుపుతప్పి వాగులో పడిపోవడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా పడగల్ గ్రామానికి చెందిన గాదెపల్లి రమేశ్ (56) వేల్పూర్ మండలంలోని కాలువ కట్టపై కారును రివర్స్ తీస్తుండగా అదుపుతప్పి మత్తడి వాగులో పడిపోయింది. కారు నీళ్లలో మునిగిపోవడంతో రమేశ్ ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులకు ఘటనాస్థలానికి చేరుకుని కారును వెలికి తీయించి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.

సంబంధిత పోస్ట్