గుజరాత్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ల బాలికను ఓ కారు ఢీ కొట్టింది. దీంతో బాలిక మృతి చెందింది. ఈ ఘటన మెహసానాలోని స్పర్ష్ విల్లా సొసైటీలో జరిగింది. బాలిక సైకిల్ పై వెళుతుండగా ఒక్కసారిగా కారు దగ్గరగా వస్తుంది. అది గమనించిన బాలిక చేయి అడ్డు పెట్టి దిగే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో అదుపుతప్పి కిందపడింది. బాలిక పడిపోయిన విషయం గమనించని డ్రైవర్ బాలికను తొక్కుకుంటూ కారును ముందుకు పోనిచ్చాడు. ఈ ప్రమాద దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.