అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ (78) ప్రమాణస్వీకారానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే నెల 20న నిర్వహించనున్న ఈ కార్యక్రమం కోసం విరాళాల సేకరణ కూడా మొదలైంది. ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్(54) దంపతులతో ప్రైవేట్ డిన్నర్ ఆఫర్ వెలువడింది. ఎవరైతే 2 మిలియన్ డాలర్లు(రూ.17 కోట్లు) చెల్లిస్తారో వారు.. జనవరి 19న ట్రంప్ దంపతులతో గడపవచ్చు. క్యాండిల్ లైట్ డిన్నర్ కూడా చేయవచ్చని అమెరికా వార్తా సంస్థలు తెలిపాయి.