పాఠశాలలో ర్యాగింగ్ తట్టుకోలేక ఆరో తరగతి విద్యార్థి ఆత్యహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన తెలంగాణ మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో జరిగింది. పదో తరగతి విద్యార్థుల ర్యాగింగ్ తాళలేక ఆరో తరగతి విద్యార్థి(12) ఒకరు ఎలర్జీ నివారణకు వాడే ఔషధం తాగాడు. గమనించిన తోటి విద్యార్థులు ఉపాధ్యాయులకు తెలియజేయడంతో వారు స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.