బ్యాంకులో మహిళా ఉద్యోగిపై వ్యక్తి అసభ్య ప్రవర్తన (వీడియో)

70చూసినవారు
బిహార్‌లోని పట్నాలో ఓ వ్యక్తి మహిళా బ్యాంక్ మేనేజర్‌తో అసభ్యంగా ప్రవర్తించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గాంధీ మైదాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కెనరా బ్యాంక్ బ్రాంచ్‌లో రాకేష్ కుమార్ సింగ్‌ అనే వ్యక్తి, మహిళా బ్యాంక్ మేనేజర్‌ అయిన వందనా వర్మపై అనుచితంగా ప్రవర్తించాడు. తనకు CIBIL స్కోర్ లేకపోవడంతో లోన్ రిజక్ట్ కావడంతో బ్యాంకు మేనేజర్‌పై దాడికి దిగాడు. ఈ ఘటన అనంతరం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్