AP: రాష్ట్రంలో 3 వేల మంది బాలికలు అదృశ్యమయ్యారని వచ్చిన ఫిర్యాదుపై సీఎస్‌కు జాతీయ హ్యూమన్ రైట్స్ కమిషన్ సమన్లు జారీ చేసింది. బాలికల మిస్సింగ్‌పై ఓ సామాజిక కార్యకర్త జనవరిలో NHRCకి ఫిర్యాదు చేశారు. దీనిపై నివేదిక పంపాలని కమిషన్ సీఎస్‌ను కోరింది. రిమైండర్లు పంపినా స్పందించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి సమాచారం, డాక్యుమెంట్లతో 2025 జనవరి 20వ తేదీలోగా తమ ముందు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది.