టీడీపీలో చేరనున్న వాసిరెడ్డి పద్మ!

81చూసినవారు
టీడీపీలో చేరనున్న వాసిరెడ్డి పద్మ!
AP: మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ త్వరలో టీడీపీలో చేరబోతున్నారు. వచ్చే వారం టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. శనివారం విజయవాడలో ఎంపీ కేశినేని చిన్నితో భేటీ అయి చేరికపై ఆమె చర్చించారు. ఈ భేటీ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకోగా.. పార్టీలో చేరికపై ముహూర్తం ఇంకా నిర్ణయించలేదు. టీడీపీలో చేరికపై త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. కాగా, ఇటీవల ఆమె వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్