కోల్‌కతాలోని ఆర్జీ కర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ పై వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేయాలని కోల్‌కతా హైకోర్టు శనివారం సిబిఐని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు సీబీఐ సందీప్ ఘోష్ పై అవినీతి కేసు నమోదు చేసింది. ఆస్పత్రిలో ఘోష్ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డాడనే ఆరోపణలపై మొదట ఈ కేసుపై 'సిట్' దర్యాప్తు చేపట్టింది. ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం, హత్య జరిగిన 2 రోజుల తర్వాత ఘోష్ తన పదవికి రాజీనామా చేశారు.