రూ.25.50 లక్షలు పలికిన ఫ్యాన్సీ నంబర్

54చూసినవారు
రూ.25.50 లక్షలు పలికిన ఫ్యాన్సీ నంబర్
ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయం నిర్వహించిన ఆన్లైన్ వేలంలో వాహన ఫ్యాన్సీ నంబర్ రికార్డు ధర పలికింది. కొత్త సిరీస్ టీజీ 09 9999 నంబర్ కి వేలంలో రూ.25.50 లక్షల ఆదాయం వచ్చింది. సోనీ ట్రాన్స్ పోర్ట్ సొల్యూషన్స్ తమ టయోటా ల్యాండ్ క్రూజర్ కోసం ఈ నంబరు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. దీంతోపాటు మరికొన్ని నంబర్ల వేలం ద్వారా ఒక్క రోజే రవాణా శాఖకు రూ.43,07,284ల ఆదాయం సమకూరినట్లు ఆర్టీవో అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్