AP: మహిళపై దాడికి పాల్పడ్డారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ పై టీడీపీ హైకమాండ్ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలం గోపాలపురం గ్రామానికి చెందిన మహిళపై ఎమ్మెల్యే దాడి ఘటనపై సీఎం చంద్రబాబు చర్యలు తీసుకునేందుకు ఆదేశించినట్లు సమాచారం. దీంతో రేపు టీడీపీ క్రమశిక్షణ సంఘానికి ఎమ్మెల్యే కొలికపూడి వివరణ ఇవ్వాల్సి ఉంంది. కమిటీ నివేదిక ఆధారంగా కొలికపుడిపై తదుపరి చర్యలు తీసుకోనున్నారు.