సంక్రాంతి సెలవులకు వెళ్లి తిరిగి వస్తున్న వారితో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా రద్దీ నెలకొంది. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. చౌటుప్పల్ సమీపంలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. సోమవారం కూడా రద్దీ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు, ప్రయాణికులతో విజయవాడ బస్టాండ్, రైల్వే స్టేషన్‌లో రద్దీ నెలకొంది. విజయవాడ నుంచి ఇవాళ 133 అదనపు బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు.