ఇన్సూరెన్స్ లేకుండా వాహనాన్ని నడుపుతూ పట్టుబడితే రూ.2,000 జరిమానా

51చూసినవారు
ఇన్సూరెన్స్ లేకుండా వాహనాన్ని నడుపుతూ పట్టుబడితే రూ.2,000 జరిమానా
ఇన్సూరెన్స్ లేని వాహనాలు నడిపి, మోటారు వాహన చట్టాన్ని ఉల్లంఘించిన వారికి ఎలాంటి శిక్షలు విధిస్తారో తెలుపుతూ రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ ఎక్స్ లో ఓ పోస్ట్ చేసింది. ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ మొదటి సారి పట్టుబడితే రూ. 2000 జరిమానా లేదా 3 నెలల జైలుశిక్ష విధించబడుతుంది. ఇదే నేరాన్ని పునరావృతం చేస్తూ పట్టుబడితే రూ. 4000 జరిమానా లేదా 3 నెలల జైలు శిక్ష విధిస్తామని తెలిపింది. కొన్ని సందర్భాల్లో జరిమానా, జైలుశిక్ష రెండూ విధిస్తారు.

సంబంధిత పోస్ట్