గొల్లప్రోలు వద్ద హైవేపైకి చేరిన వరద

55చూసినవారు
గొల్లప్రోలు వద్ద హైవేపైకి చేరిన వరద
కాకినాడ జిల్లా గొల్లప్రోలు టోల్‌గేట్ వద్ద హైవేపైకి వరద నీరు చేరింది. ఏలేరు జలాశయం నుంచి వచ్చిన వరద నీరు రోడ్డుపైకి రావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాకినాడ నుంచి కత్తిపూడి, విశాఖ వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. అచ్చంపేట, తిమ్మాపురం జంక్షన్ల నుంచి సామర్లకోట మీదుగా వాహనాలను మళ్లించారు. వాహనదారులు, ప్రయాణికులు సహకరించాలని పోలీసులు కోరారు.

సంబంధిత పోస్ట్