అమెరికాలో నేటి నుంచి స్వర్ణయుగం ప్రారంభమైందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం అనంతరం వాషింగ్టన్ డీసీలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘నా ప్రమాణస్వీకార కార్యక్రమానికి వచ్చిన అతిథులందరికీ సుస్వాగతం. అమెరికాలో నేటి నుంచి స్వర్ణ యుగం మొదలైంది. ఇవాళ్టి నుంచి అమెరికా ప్రపంచ దేశాల గౌరవం పొందుతుంది. దేశంలో నేర ఘటనలు తగ్గించాల్సిన అవసరం ఉంది. అమెరికాకు ప్రపంచ దేశాల సహకారం కూడా కావాలి." అని అన్నారు.