మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం

55చూసినవారు
మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం
మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర మంత్రులు ఇకపై స్వంతంగా ఆదాయపు పన్ను కట్టాలని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నేతృత్వంలోని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో 52 ఏళ్ల నాటి నిబంధనను ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వమే మంత్రుల పన్నుల భారాన్ని భరిస్తోంది. 1972 నుంచి ఈ నిబంధన అమల్లో ఉండగా, ఇకపై మంత్రులే ఆదాయపు పన్ను కట్టాల్సి ఉంటుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్