1996లో వచ్చి భారీ హిట్ అందుకున్న చిత్రం ‘భారతీయుడు’కి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘భారతీయుడు-2’ ట్రైలర్ వచ్చేసింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. లోక నాయకుడు నటుడు కమల్ హాసన్ - దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రం జులై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కూడా అవినీతిపైనే పోరాటం సాగుతున్నట్టు ట్రైలర్‌లో చూపించారు.