వారణాసిని శివుని నివాసంగా భావిస్తారు. ఇక్కడ భోలాశంకరుడు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. సోనార్‌పురా రోడ్‌కు సమీపంలో ఉన్న కేదార్ ఘాట్ వద్ద ఉన్న కేదారేశ్వరాలయం వారణాసిలోని పురాతన పవిత్ర ప్రదేశాలలో ఒకటి. ఇక్కడే శివలింగం మొదట కనిపించిందని చెబుతారు. ఈ ఆలయంలో శివలింగం రెండు భాగాలుగా విభజించబడి ఉంటుంది. ఒక భాగంలో శివపార్వతిలు ఉండగా.. మరొక భాగంలో నారాయణుడు తన భార్య లక్ష్మితో ఉంటాడని విశ్వాసం.