జమ్మూకశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం

50చూసినవారు
జమ్మూకశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం
జమ్మూకశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ భద్రతకు సంబంధించి తీవ్ర ఆరోపణల నేపథ్యంలో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. కాగా విధుల నుంచి తొలగించిన ఉద్యోగుల్లో ఇద్దరు పోలీసులుండడం గమనార్హం. విధుల నుంచి తొలగించిన ఉద్యోగులకు.. నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయన్న కారణంగా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్