TG: కాంగ్రెస్ పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 14 నుండి డిసెంబర్ 9 వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా విజయోత్సవాలు నిర్వహించనుంది. గత పది ఏళ్లలో ఊహకందని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికను త్వరలోనే విడుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.