నిపుణుల ప్రకారం.. శీతాకాలంలో రోజూ ఉదయం 2 పచ్చి వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల అందులోని అల్లిసిన్ అనే సల్ఫర్ సమ్మేళనం శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీనిలో అధిక మోతాదులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, సల్ఫర్ సమ్మేళనాలు మెదడు పనితీరును, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే, శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుతుంది. తద్వారా గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తుంది.