నిమిషం లేటు.. నామినేషన్ కు దూరమైన అభ్యర్థి

69చూసినవారు
పెద్దపల్లి జిల్లాలో నిమిషం లేటు రావడంతో ఓ అభ్యర్థి నామినేషను దూరమయ్యారు. దళిత బహుజన పార్టీ అభ్యర్థి మాతంగి హనుమయ్య.. నిమిషం ఆలస్యంగా ఆర్వో కార్యాలయానికి చేరుకున్నారు. అయితే అప్పటికే అధికారులు గేట్లు మూసేశారు. దీంతో లోపలికి పంపించాలని బయట ఉన్న అధికారిని హనుమయ్య బతిమిలాడారు. చివరికి కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించగా ఆయన వారించారు. నిబంధనల ప్రకారం నామినేషన్ కు అవకాశమే లేదన్నారు.

సంబంధిత పోస్ట్