ఆయుర్వేద నియమాల ప్రకారం వేరుశనగలు తిన్న వెంటనే నీళ్లు తాగడం చేయకూడదు. ఇలా చేయడం వల్ల జీర్ణవ్యవస్థ చెడు ప్రభావం పడుతుంది. వేరుశెనగలను తిన్న వెంటనే నీరు తాగితే శరీరం, గొంతులోని ఉష్ణోగ్రత క్షీణిస్తుంది. గొంతులో శ్లేష్మం పేరుకుపోయే అవకాశం ఉంది. దగ్గు, శ్వాసకోశ సమస్యలు కూడా వస్తాయి. ఆయుర్వేదం ప్రకారం ఇలాంటివి తిన్న తర్వాత 20 నిమిషాల పాటు ఏమీ తినకూడదు.