చంద్రబాబు కోసం నూతన కాన్వాయ్‌ సిద్ధం

65చూసినవారు
చంద్రబాబు కోసం నూతన కాన్వాయ్‌ సిద్ధం
టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 12న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈక్రమంలో ఆయన కోసం నూతన కాన్వాయ్‌ సిద్ధమైంది. తాడేపల్లిలోని ఇంటెలిజెన్స్ కార్యాలయం వద్ద మొత్తం 11 వాహనాలను అధికారులు సిద్ధం చేశారు. ఇందులో రెండింటిని సిగ్నల్ జామర్ కోసం కేటాయించారు. టయోటా కంపెనీకి చెందిన నలుపు రంగు వాహనాలకు 393 నెంబర్లు వేశారు. వీటిని చంద్రబాబు కాన్వాయ్‌ కోసం తయారు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్