వాట్సప్ కొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఆండ్రాయిడ్ యూజర్లకు వాట్సప్ ట్రాన్స్‌ఫర్ చాట్ హిస్టరీ అనే ఫీచర్‌ని పరిచయం చేయనుంది. దీని ద్వారా యూజర్లు గూగుల్ డ్రైవ్‌ను ఉపయోగించకుండానే పాత ఫోన్ నుంచి కొత్త ఫోన్‌కి చాట్ హిస్టరీని చాలా ఈజీగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఇందుకోసం యాప్ సెట్టింగ్స్‌లో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే సరిపోతుంది. త్వరలోనే దీన్ని అందుబాటులోకి తీసుకురానుంది.