కేరళలోని త్రిసూర్‌కు చెందిన 93 ఏళ్ల వృద్ధురాలు 'వడకేపట్ మాధవి కుట్టి అమ్మ' కుట్టుపనిని జీవన విధానంలో ఒక భాగంగా చేసుకుని నేటి యువతకు ఆదర్శంగా నిలిచారు. వృద్ధాప్యం రీత్యా కష్టాలు వచ్చినా ఆమె తన అభిరుచి అయిన కుట్టుపని వదులుకోవడానికి ఇష్టపడదు. 'కుట్టుపని కేవలం నా సంపాదనకు మూలం కాదు.. కుట్టుపని మరియు కృష్ణుడు నా జీవితంలో ఒక భాగం. ఈ జీవితంలో నేను దాని నుండి దూరం కాలేను.' అని ఆమె తెలిపారు.