సగం ఆడ, సగం మగ లక్షణాలున్న అరుదైన పక్షి! (Video)

540చూసినవారు
పక్షుల్లో కూడా ట్రాన్స్‌జెండర్లు ఉంటాయని మీరు ఎప్పుడైనా విన్నారా? అవును నిజం. శాస్త్రవేత్తలు పూర్తిగా మగ కాని, ఆడ కాని పక్షిని కనుగొన్నారు. ప్రపంచంలో కెల్ల అరుదైన, వింత జీవి ఈ పక్షి. ఆడ, మగ ఇద్దరి గుణాలు ఇందులో కనిపిస్తాయి. వీటిని ‘గైనండోమోర్స్’ అంటారు. న్యూజిలాండ్‌ శాస్త్రవేత్త, యూనివర్సిటీ ఆఫ్‌ ఒటాగో జంతు శాస్త్రజ్ఞుడు ప్రొఫెసర్‌ హమీష్‌ స్పెన్సర్‌, కొలంబియాలో ఇలాంటి అరుదైన పక్షిని గుర్తించారు. తాజాగా ఈ వార్త నెట్టింట ట్రెండ్ అవుతోంది.

సంబంధిత పోస్ట్