ఇప్పటికే సామాన్యుడి జీవనం కష్టంగా మారిందంటే.. మరో భారం పడనుంది. తెలుగు రాష్ట్రాల్లో ఉల్లిపాయల ధరలు మళ్లీ ఘాటెక్కే అవకాశం ఉంది. వర్షాల కారణంగా పలు చోట్ల పంటలు దెబ్బతినడమే ఇందుకు కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కర్నూలు మార్కెట్‌లో ప్రస్తుతం క్వింటాల్ ఉల్లి ధర రూ.3700 ఉండగా, రిటైల్ మార్కెట్‌లో కిలో రూ.40-60 వరకూ పలుకుతోంది. దిగుమతి తక్కువగా ఉండటంతో డిమాండ్ పెరిగి త్వరలోనే ధర మరింత పెరిగే ఛాన్స్ ఉంది.