గుండెపోటుతో స్కూళ్లోనే కుప్పకూలిన విద్యార్థి

159946చూసినవారు
గుండెపోటుతో స్కూళ్లోనే కుప్పకూలిన విద్యార్థి
పేదరికం ఓ విద్యార్థి ప్రాణం తీసింది. సిరిసిల్ల జిల్లా కందికట్కూర్ గ్రామానికి చెందిన సాయితేజ (14) గుండెపోటుతో పాఠశాల ఆవరణలోనే ప్రాణాలు వదిలాడు. ఎనిమిదో తరగతి చదువుతున్న ఈ బాలుడికి పుట్టుకతోనే హార్ట్ లో హోల్ ఉంది. ఆపరేషన్ తప్పనిసరిగా చేయించాలని డాక్టర్లు చెప్పినా ఆర్థిక స్తోమత లేకపోవడంతో తల్లిదండ్రులు వైద్యం చేయించలేకపోయారు. ఈ క్రమంలో మంగళవారం స్కూల్ ఆవరణలోనే గుండెపోటుతో కుప్పకూలి చనిపోయాడు.

సంబంధిత పోస్ట్