బోరుబావిలో పడిన మూడేళ్ల బాలిక

74చూసినవారు
బోరుబావిలో పడిన మూడేళ్ల బాలిక
బోరుబావిలో మూడేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు పడిపోయింది. మధ్యప్రదేశ్‌లో రాష్ట్రంలోని సింగ్రౌలి జిల్లాలోని కసర్ గ్రామంలో సోమవారం ఈ సంఘటన జరిగింది. ఆమెను రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పుట్టిన రోజునే బాలిక బోరుబావిలో పడిపోవడంతో కుటుంబం కన్నీరుమున్నీరు అవుతోంది. సాయంత్రం 4 గంటలకు పాప పుట్టినరోజు వేడుకల కోసం బంధువులు సిద్ధమవుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం పాప 18-20 అడుగుల లోతులో ఉన్న గొయ్యిలో చిక్కుకుపోయింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్