మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగం విధ్వంసం ఓ మహిళ ప్రాణాలు తీసింది. కొండ వైపు నుంచి వేగంగా వస్తున్న UP96 T 7171 నెంబర్ కలిగిన ఓ ట్రక్కు ప్రమాదవశాత్తు ద్విచక్రవాహనదారుడిని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళా మృతి చెందగా.. చిన్నారి, ఆమె భర్త గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.