సినిమాలోని పాత్రల స్పూర్తితో యువ దంపతులు దొంగతనాలకు పాల్పడి చివరికి కటకటాలపాలయ్యారు. నార్త్ ఢిల్లీలో గౌరవ్ (30), వందన (30) దంపతులు ఓ ఇంట్లో స్మార్ట్ ఫోన్ దొంగిలించారు. పోలీసుల విచారణలో తాము బంటీ ఔర్ బబ్లీ సినిమాలో పాత్రలను చూసి ప్రేరణ పొందినట్లు నిందితులు వెల్లడించారు. తెల్లవారుజామున మార్నింగ్ వాక్‌కు, ఆలయాలకు వెళ్లే వారి ఇళ్లను టార్గెట్ చేసుకుని చోరీలు చేసినట్లు వారు అంగీకరించారు.