TG: రంగారెడ్డి జిల్లా పాలమాకులకు చెందిన శివ (22) అనే యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన 17 ఏళ్ల ఓ మైనర్ వైద్య విద్యార్థినిని అపహరించి అత్యాచారం చేశాడు. ఆదిలాబాద్‌కు చెందిన బాలికకు శివ అనే యువకుడు ఇన్‌స్టాలో పరిచయమై పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆపై జనవరి 9న సికింద్రాబాద్‌లో బాలికను కలుసుకుని.. ప్రలోభపెట్టి అత్యాచారం చేశాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని బాలిక ఆచూకీ గుర్తించిన పోలీసులు నిందితుడిని పోక్సో కేసులో జైలుకు తరలించారు.