భోపాల్ రైల్వే స్టేషన్ నుంచి వెళ్తున్న కుషినగర్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఆకతాయిలు రెచ్చిపోయారు. ఇద్దరు వ్యక్తులు ఒక యువకుడిపై దాడి చేశారు. రైలు కదులుతుండగా కంపార్ట్‌మెంట్ డోర్ వద్ద నిల్చొని ప్లాట్‌ఫారమ్‌పై ఆ యువకుడి చొక్కా పట్టుకొని ఈడ్చుకెళ్లారు. రైలు వేగం పెరగడంతో అతడిని వదిలారు. దీంతో ఆ యువకుడు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరలవడంతో ఆ వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేశారు.