ఢిల్లీలో తీవ్ర నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జలవనరుల శాఖ మంత్రి అతిషి మర్లెనా నిరాహార దీక్ష ప్రారంభించారు. దక్షిణ ఢిల్లీలోని భోగల్‌లోని సమరపంథాల్ లో చేపట్టిన ఈ దీక్షలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ వంటి నేతలు కూడా పాల్గొన్నారు.