‘ఇండియా’ కూటమిలో ఆప్, కాంగ్రెస్ మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ అరవింద్ కేజ్రీవాల్‌ని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో కాంగ్రెస్, అజయ్ మాకెన్‌ని 24 గంటల్లో పార్టీ నుంచి తొలగించాలని ఆప్ అల్టీమేటం జారీ చేసింది. లేకపోతే కాంగ్రెస్‌ను కూటమి నుంచి తొలగించేలా ఇతర పార్టీలను కోరుతామని ఆప్ నేతలు పేర్కొన్నారు.