ఆ ముగ్గురూ లేకపోవడం మాకు అనుకూలం: జయసూర్య

56చూసినవారు
ఆ ముగ్గురూ లేకపోవడం మాకు అనుకూలం: జయసూర్య
శ్రీలంకతో భారత్ సిరీస్‌కు ముందు లంక జట్టు తాత్కాలిక కోచ్‌ సనత్‌ జయసూర్య కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్‌, కోహ్లి, జడ్డూ టీమిండియా జట్టుతో లేకపోవడం తమకు అనుకూలిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. దీనిని మేము సద్వినియోగం చేసుకుంటామని తెలిపాడు. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి ముందు వరుసలో ఉంటారన్నాడు. ఈ ముగ్గురూ భారత టీ20 జట్టులో లేరు. వారి గైర్హాజరీ తప్పకుండా మాకు లాభిస్తుంది అని పేర్కొన్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్