బళ్లారి జైలుకు తీసుకెళ్తుండగా సన్ గ్లాసెస్ తో కనిపించిన నటుడు దర్శన్, ఎస్కార్ట్ బృందానికి నోటీసులు

549చూసినవారు
బళ్లారి జైలుకు తీసుకెళ్తుండగా సన్ గ్లాసెస్ తో కనిపించిన నటుడు దర్శన్, ఎస్కార్ట్ బృందానికి నోటీసులు
కన్నడ స్టార్ హీరో దర్శన్ కు బెంగళూరులోని పరప్పన అగ్రహారం జైలులో రాచ మర్యాదలు అందుతున్నాయని తేలడంతో ప్రభుత్వం అతనిని బళ్లారి జైలుకు తరలించింది. అయితే జైలుకు తీసుకెళ్లే సమయంలో దర్శన్ సన్ గ్లాసెస్ ధరించి కనిపించాడు. ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. దీంతో దర్శన్ ఎస్కార్ట్ బృందానికి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. వారిపై క్రమశిక్షణా చర్యలు సైతం తీసుకోనున్నట్లు తెలిపింది. కాగా, రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ అరెస్టైన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్