సోషల్ మీడియాలో ట్రోల్స్‌పై నటుడు మోహన్‌బాబు స్పందించారు. తాను ట్రోల్స్ గురించి పట్టించుకోనని, ఒకరిని ట్రోల్ చేస్తే ఏం ఆనందం అర్థం కాదని అసహనం వ్యక్తం చేశారు. తాను అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తినని అన్నారు. కాగా మంచు ఫ్యామిలీపై సోషల్ మీడియాలో కొందురు ట్రోల్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' సినిమాను కూడా ట్రోల్ చేశారు. దీంతో మోహన్‌బాబు ఇలా స్పందించినట్లు తెలుస్తోంది.