టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై సినీ నటి పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేసింది. 'త్రివిక్రమ్ పై నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)లో ఫిర్యాదు చేసి చాలా కాలమైంది. ఇప్పటి వరకు ‘మా’దానిపై స్పందించలేదు. త్రివిక్రమ్‌ని ప్రశ్నించడం కానీ అతనిపై చర్యలు తీసుకోవడం కానీ జరగలేదు. నా జీవితాన్ని నాశనం చేసి ఆరోగ్యంగా, ఆనందంగా లేకుండా చేసిన అతన్ని ఇప్పటికీ ఇండస్ట్రీ పెద్ద మనిషిగానే ప్రోత్సహిస్తుంది'అని పూనమ్ ట్వీట్లో పేర్కొన్నారు.