అటవీ అధికారుల మీద దాడి చేసిన గ్రామస్థులు (వీడియో)

59చూసినవారు
TG: అటవీశాఖ అధికారుల మీద దాడిచేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇచ్చోడ మండలం కేశవపట్నం గ్రామంలో అటవీశాఖ అధికారులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. దీనిలో భాగంగా కలప దుంగలు, ఫర్నీచర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో గ్రామస్తులు అధికారులపై దాడిచేశారు. ఈ దాడిలో బీట్ ఆఫీసర్‌కు గాయాలు కాగా, ఒక వాహనం ధ్వంసమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గ్రామాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్