వివాదంలో చిక్కుకున్న నటి రాధ

1556చూసినవారు
వివాదంలో చిక్కుకున్న నటి రాధ
సుందర ట్రావెల్స్ (2002) ఫేమ్, తమిళ నటి రాధ మరో వివాదంలో చిక్కుకున్నారు. ద్వారకేశ్ అనే వ్యక్తిని నటి రాధకు మురళీకృష్ణ పరిచయం చేశాడు. ద్వారకేశ్ వద్ద బిట్‌కాయిన్స్‌పై రాధ పెట్టుబడి పెట్టింది. అయితే బిట్‌కాయిన్స్‌ను రాధకు ద్వారకేశ్ ఇవ్వలేదు. దీంతో ఆ డబ్బు తనకు ఇవ్వాలని మురళీకృష్ణను రాధ అడిగింది. తల్లి, కొడుకు, మరికొందరితో కలిసి వచ్చి మురళీకృష్ణను కొట్టింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్