కేరళ సీఎం సహాయ నిధికి అదానీ, హీరో విక్రమ్, పలువురు ప్రముఖులు భారీ విరాళాలు ప్రకటించారు. పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. రూ.5 కోట్ల విరాళం అందజేశారు. ఆర్పీ గ్రూప్ రవి పిళ్లై, లూలు గ్రూప్ ఇంటర్నేషనల్ ఛైర్మన్ ఎం.ఎ.యూసఫ్ అలీ, కల్యాణ్ జువెలర్స్ ఛైర్మన్ ఎండీ టి.ఎస్.కల్యాణరామన్ ఒక్కొక్కరూ రూ.5కోట్ల విరాళాన్ని ప్రకటించారు. నటుడు విక్రమ్ రూ.20లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.