నూతన చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

69చూసినవారు
నూతన చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
నూతన నేర చట్టాలపై అవగాహన పెంచుకొని పకడ్బందీగా అమలు చేయాలని అదనపు ఎస్పీ బి. సురేందర్ రావు సూచించారు. వచ్చే నెల ఒకటి నుంచి అమలు చేయనున్న నూతన నేర చట్టాలపై ఆదిలాబాద్ లోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో పోలీస్ అధికారులకు సోమవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడుతూ కొత్త క్రిమినల్ కోడ్ చట్టాల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి ఎల్. జీవన్ రెడ్డి, సిఐ ఫణిధర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్