జమ్మూ ఉగ్రదాడి చాలా బాధాకరం: రాహుల్

70చూసినవారు
జమ్మూ ఉగ్రదాడి చాలా బాధాకరం: రాహుల్
'జమ్మూకాశ్మీర్‌లోని రియాసి జిల్లాలో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు జరిపిన దాడి చాలా బాధాకరం. ఈ సిగ్గుచేటు ఘటన జమ్మూకాశ్మీర్‌లో ఆందోళనకరంగా ఉన్న భద్రతా పరిస్థితికి వాస్తవ చిత్రం. మృతుల కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం మొత్తం ఏకతాటిపై నిలబడింది.' అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్